Penguin swinging Video: పెంగ్విన్ జంపింగ్ జపాంగ్.. ఇంత దర్జాతనం చూస్తే నవ్వాపుకోలేరు..! వైరల్ వీడియో..
పెంగ్విన్ నడుస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది.. మన ఇంట్లో బొద్దుగా.. ముద్దుగా ఉండే చిన్నారుల నడకను కాపీ చేసినట్లుగా ఉంటుంది వాటి నడక అయితే.. అయితే ఇవాళ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెంగ్విన్ నడక నెటిజన్లను నవ్వులు పూయించింది.
పెంగ్విన్ నడుస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది.. మన ఇంట్లో బొద్దుగా.. ముద్దుగా ఉండే చిన్నారుల నడకను కాపీ చేసినట్లుగా ఉంటుంది వాటి నడక అయితే.. అయితే ఇవాళ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెంగ్విన్ నడక నెటిజన్లను నవ్వులు పూయించింది. ఆ పెంగ్విన్‌ని మీరు చూస్తే అదే అంటారు.. అయితే.. పెంగ్విన్ ఎగరదు, నీటిలో తేలుతుంది. ఇవి 900 అడుగుల లోతు వరకు నీటిలో సులభంగా ఈదగలవు.. అదే సమయంలో అవి దాదాపు 20 నిమిషాల పాటు శ్వాసను కూడా బిగబట్టి ఉండగలవు. వాటి జీవితంలో సగానికి పైగా నీటిలోనే గడిచిపోతుంది. ఇది సాధారణంగా మంచు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇతర ప్రదేశాలలో అరుదుగా కనిపిస్తుంది. అయితే, ఇవాళ సోషల్ మీడియాలో ఈ బెజ్జి పెంగ్విన్ నడక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాని నడక చూసిన మరికొన్ని పెంగ్విన్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాయి. దాని ఫన్నీ నడకకు మీరు చూసినా అదే అంటారు. అందులో పెంగ్విన్ సరదాగా జంప్ చేస్తూ కనిపించింది. ఈ బుజ్జి పెంగ్విన్‌ను చూస్తుంటే లోకంలోని బాధలన్నీ తీరి ఆనందిస్తున్నట్లు అనిపిస్తుంది.