రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

Updated on: Dec 27, 2025 | 7:49 PM

సిమ్లాలోని IGMC ఆసుపత్రిలో ఓ డాక్టర్ రోగిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సెలైన్ స్టాండ్‌తో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో, రోగి బంధువులు నిరసన తెలిపారు. ఆరోగ్య మంత్రి దర్యాప్తుకు ఆదేశించగా, వైద్యుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రోగి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది, ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. డాక్టర్లు విచక్షణా రహితంగా దాడిచేసి చితక్కొట్టారు. బెడ్‌పై పడుకుని ఉన్న రోగిపై తెల్ల కోటు ధరించిన ఓ డాక్టర్‌ సెలైన్ స్టాండ్‌తో చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆసుపత్రి ఆవరణ వెలుపల నిరసనకు దిగారు. డాక్టర్లు రోగిని పిడి గుద్దులతో కొడుతున్న వీడియో ఆసుపత్రిలో ఇతర రోగులు రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ లో సోమవారం ఒక వైద్యుడు రోగిపై దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. వైద్య పరీక్షల నిమిత్తం అర్జున్ పన్వర్ అనే వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. సిమ్లా జిల్లాకు చెందిన అర్జున్ పన్వర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతడు ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఎండోస్కొపీ కోసం ఆసుపత్రికి వెళ్లిన అనంతరం, సిబ్బంది సూచన మేరకు అర్జున్ పన్వర్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఖాళీ బెడ్‌పై పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వైద్యుడు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడని అర్జున్ పన్వర్ ఆరోపించాడు. తాను మర్యాదగా ప్రవర్తించమని కోరినందుకు వైద్యుడు తనపై దాడి చేశాడని తెలిపాడు. డాక్టర్ కోపంతో రోగిని కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. రోగి కాళ్లతో డాక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో కనిపించింది. ఇతర డాక్టర్లు.. దాడి చేస్తున్న డాక్టర్‌ను అదుపు చేయడానికి బదులు రోగి ప్రతిఘటించకుండా పట్టుకోవడం విశేషం. దీంతో డాక్టర్‌ బాధితుడిపై పడి విచక్షణా రహితంగా కొట్టడం వీడియో ద్వరా స్పష్టమవుతోంది. ఈ ఘటన అనంతరం రోగి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ దాడిలో బాధితుడి ముక్కుకు గాయమైంది. బాధితుడు వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.అయితే, తొలుత రోగే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని వైద్యుడు పేర్కొన్నాడు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ధని రామ్ శాండిల్ స్పందించారు. రోగి పట్ల వైద్యుడి ప్రవర్తనను ఆయన ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

Bad Girl Review: కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్