విమానం ఇంజిన్‌లో నాణేలు .. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఓ విమాన ప్రయాణికుడి మూఢనమ్మకం తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టింది. విమానం 4 గంటల ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమైంది. చైనాలో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. చైనా సదర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్చి 6న సాన్యా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు. మూఢనమ్మకంతో అతడు అదృష్టం కోసమని విమానం ఇంజిన్‌లోకి నాణేలు విసిరాడు.
ఓ విమాన ప్రయాణికుడి మూఢనమ్మకం తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టింది. విమానం 4 గంటల ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమైంది. చైనాలో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. చైనా సదర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్చి 6న సాన్యా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు. మూఢనమ్మకంతో అతడు అదృష్టం కోసమని విమానం ఇంజిన్‌లోకి నాణేలు విసిరాడు. చైనా మీడియా కథనాల ప్రకారం, నిందితుడు సుమారు మూడు నాలుగు నాణేలు విమానం ఇంజిన్‌లో విసిరినట్టు తెలిసింది. అనుమానితుడ్ని ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నిందితుడు తన తప్పును అంగీకరించినట్టు కూడా వెల్లడైంది. దీంతో, నిర్వహణ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో, దాదాపు నాలుగు గంటల జాప్యం అనంతరం విమానం బయలుదేరింది. తనిఖీల సందర్భంగా విమానం ఇంజిన్‌లో నాణేలు లభించినట్టు ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. నిందితుడి వివరాలు కూడా ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష
వేసవి అయ్యేంత వరకు బెంగళూరు వెళ్లకండి
బిచ్చగాడి సంపాదన నెలకు రూ. 8 లక్షలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

