Viral Video: మహిళా సిబ్బందితో అసభ్య ప్రవర్తన.. ప్రయాణికుడిని ఏంచేశారో తెలుసా..! వైరలవుతోన్న వీడియో

విమానాల్లో చాలా మంది ఎయిర్ లైన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తునే ఉన్నాం. తాజాగా అమెరికాలోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో ఒక వ్యక్తి మహిళా సిబ్బందిని అసభ్యంగా తాకి, గందరగోళాన్ని సృష్టించాడు.

Viral Video: మహిళా సిబ్బందితో అసభ్య ప్రవర్తన.. ప్రయాణికుడిని ఏంచేశారో తెలుసా..! వైరలవుతోన్న వీడియో
Max Berry

Updated on: Aug 05, 2021 | 5:21 AM

Viral Video: ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు విమాన సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అటెండర్లు ప్రయాణీకులకు సహాయంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రయాణీకులు విమాన సిబ్బందితో తప్పుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో ఒక వ్యక్తి మహిళా సిబ్బందిని అసభ్యంగా వారి ప్రైవేట్ పార్టులను తాకుతూ గందరగోళం సృష్టించాడు. దీనిని విమానంలోని ప్రయాణీకులు వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముందంటే.. ఇందులో గందరగోళం సృష్టించిన ప్రయాణికుడు అరుస్తూ కనిపించాడు. అతను ఇద్దరు మహిళా సిబ్బంది ప్రైవేట్ పార్టులను తాకుతూ, అరవడం మొదలుపెట్టాడు. నా తల్లిదండ్రులకు 2 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ అరుస్తూనే మరొక విమాన సహాయకుడిపై దాడికి దిగాడు. ఆ ప్రయాణికుడి పేరు మాక్స్‌వెల్ విల్కిన్సన్ బెర్రీ, వయస్సు 22 లు గుర్తించారు. ఈ విషయంపై మయామి-డేడ్ పోలీసులకు కూడా సమచారం అందించారు. ఈ మొత్తం సంఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యాసింజర్‌షిమింగ్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. బెర్రీ సిబ్బందిని దుర్భాషలాడుతూ, వారిపై అరుస్తుండడాన్ని వీడియోలో చూడవచ్చు. అతను ఒక వ్యక్తిని చంపడానికి కూడా ప్రయత్నించడాన్ని వీడియోలో చూడొచ్చు. మందు తాగిన తర్వాత అతను క్యాబిన్‌లో చొక్కా లేకుండా నడిచి కొద్దిసేపు హల్‌చల్ చేశాడు. ఆ తర్వాత విమానం అమెరికాలోని మయామిలో ల్యాండ్ అయింది. దీంతో సిబ్బంది అంతా కలిసి టేప్‌తో బెర్రీని సీటుకు కట్టేశారు. ఆయన నోటికి కూడా టేపు వేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

Also Read: Viral Video: ఈ కోటలో ఆడదెయ్యం గొంతు విన్న సందర్శకులు! వీడియో

No Kissing Zone: ప్రేమికులకు శాపంగా మారిన కరోనా..!! ఇచ్చట ముద్దులు పెట్టుకో రాదు..!! వీడియో