Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

|

Nov 08, 2022 | 9:25 AM

చాలామంది చిలుకలను ఎంతో ఇష్టంగా చిలుకలను పెంచుకుంటారు. వాటితో మాట్లాడతారు. వాటికి కూడా మాటలు నేర్పుతారు. చిలుకలు ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాయి. పాటలు పాడతాయి, చక్కగా మాట్లాడతాయి.


ఇక్కడ ఓ చిలుక మాత్రం మాటల్లేవ్‌.. ఓన్లీ చాటింగ్‌ అంటోంది. అవును తాజాగా ఓ చిలుకలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ చిలుక మామూలు చిలుక కాదు. ఈ చిలుక ఏకంగా మొబైల్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేసేస్తోంది. ఫోన్‌ ఆపరేటింగ్‌లో మనుషులను మించిపోయింది. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి ఓ అమ్మాయితో చాట్ చేస్తోంది. అవతలినుంచి మెసేజ్‌ రావడమే ఆలస్యం చకచకా రిప్లై ఇచ్చేస్తుంది. అంతేకాదు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతోంది. తనకు నచ్చిన వారితో చాట్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడటం అంటే దీనికి చాలా సరదా అట. చిలుక వాట్సాప్ చాట్, వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను దాని యజమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అది చూసిన వేలాదిమంది నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. విపరీతంగా షేర్‌ చేస్తున్నారు కూడా. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు. ఇక చిలుక అల్లరిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 08, 2022 09:25 AM