వింతల్లోనే వింత !! చేతి పంపు నుంచి నీళ్లతో పాటు ఎగసిపడుతున్న మంటలు !!
మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చేతి పంపు నుంచి నీరు, మంటలు ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా భయాందోళన చెందారు.
మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చేతి పంపు నుంచి నీరు, మంటలు ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా భయాందోళన చెందారు. ఈవింతను చూసేందుకు గ్రామంలోని ప్రజలంతా ఆ చేతి పంపు చుట్టూ గుమిగూడారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చూడాలేదని స్థానికులు అంటున్నారు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఏదైనా కాలినప్పుడు లేదా మంటలను వ్యాపించే పదార్థం ఆప్రదేశంలో ఉన్నా కేవలం మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాని.. నీరు, మంటలు కలిసి ఒకేసారి రావడంతో ఆప్రాంత ప్రజలంతా ఆశ్చర్యంతోపాటు ఒకింత భయపడ్డారు స్థానికులు. ఈఘటనపై వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లి అధికారులు పరిశీలించారు. చేతి పంపు నుంచి ఒకేసారి మంటలు, నీరు రావడం మొదటిసారి చూస్తున్నామని, పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈఘటనకు గల కారణాలు తెలిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాడుబడ్డ బావిలో ఆరు పాములు !! స్నేక్ క్యాచర్ టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్
ఆగస్ట్ 23, 1966 ..చంద్రుడి ఉపరితలం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు !!
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!
టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!
Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్

