OTC Medicine: ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే ఆ మందులు..! అక్కడి నుండే కొనుగోలు చేసే అవకాశం

|

Jun 03, 2022 | 8:44 AM

ఏదైనా మందులు కొనాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ.. కొన్ని సాధారణంగా వినియోగించే మందుల విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం..


ఏదైనా మందులు కొనాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ.. కొన్ని సాధారణంగా వినియోగించే మందుల విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓవర్-ది-కౌంటర్ (OTC) పద్ధతిలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా రిటైల్ మార్కెట్‌లో నేరుగా కొనుగోలు చేసేందుకు 16 రకాల మందులను అనుమతించాలని మొదటిసారిగా ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో పారాసెటమాల్ 500 Mg సాధారణ యాంటిపైరేటిక్ ఔషధం, కొన్ని లాక్సేటివ్‌లు, యాంటీ ఫంగల్ క్రీమ్‌లను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ వినియోగదారులు మందుల దుకాణాల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించింది.దీనికి సంబంధించిన ముసాయిదా సవరణపై నెల రోజుల్లోగా ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. అయితే ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. మెడికల్ షాపులు వినియోగదారునికి కేవలం ఐదు రోజులకు సరిపడా మందులను మాత్రమే విక్రయించాలి. ఒక వేళ లక్షణాలు తగ్గకపోతే సదరు రోగి వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని షరతులను పెట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 03, 2022 08:44 AM