Tamil Nadu: తమిళనాడును వణికిస్తున్న కుండపోత వర్షాలు.! పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
కుండపోత వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్ కాశీ, తూతూకుడి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాలతో తిరునల్వేలిలో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాల దగ్గరికి ఎవరిని వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. తిరునల్వేలి జిల్లా నీట మునిగింది. తామరభరణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
కుండపోత వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్ కాశీ, తూతూకుడి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాలతో తిరునల్వేలిలో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాల దగ్గరికి ఎవరిని వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. తిరునల్వేలి జిల్లా నీట మునిగింది. తామరభరణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పాపనాశనం డ్యామ్‌కు భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు పాపనాశనం డ్యామ్ నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరునల్వేలి జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కన్యాకుమారిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
భారీ వర్షాలతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలుగు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడులోని డ్యాములన్నీ పొంగిపొర్లుతున్నాయి. కన్యాకుమారిలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ప్రజలు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పర్యాటకులు సముద్రం దగ్గరకు వెళ్లవద్దని తెలిపారు. దక్షిణ తమిళనాడులో మరో 24 గంటల పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు, వరద సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.