Tiger cubs: రోజులు గడుస్తున్న కానరాని పులి జాడ.. విలవిల్లాడుతున్న కూనలు..

|

Mar 16, 2023 | 9:26 PM

ఎరక్కపోయి ఇరుక్కుపోయాయి.. ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. ఇప్పుడవి కలిసేదెలా..? కలిపేదెవరు..? ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది.

ఎరక్కపోయి ఇరుక్కుపోయాయి.. ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. ఇప్పుడవి కలిసేదెలా..? కలిపేదెవరు..? ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. పిల్లల ప్రేమను తల్లికి అందించేందుకు యుద్ధప్రాతిపదికన స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామస్తులకు నాలుగు పులి కూనలు చిక్కాయి. మూడు రోజులు గడిచినా తల్లి పులి రాకపోవడంతో ఈ కూనల సంరక్షణ కష్టంగా మారింది. సాధారణంగా ఒక పులి రెండు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఆ పెద్ద పులి నాలుగు ఆడ పులిపిల్లలకు జన్మనిచ్చింది. ఇది చాలా అరుదన్నారు ఫారెస్ట్ అధికారులు. మూడు రోజులు గడిచినా పెద్ద పులి జాడలేకపోవడంతో తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ఏర్పాటు చేసి.. 200 సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ లతో కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే, మనుషులు తాకిన పిల్లలను తల్లి పులి తిరస్కరించే అవకాశం ఉందని.. జాప్యం జరిగితే కూనలను సైతం మర్చిపోయే ఛాన్స్‌ ఉందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్. దీంతో పెద్ద పులి జాడ కోసం అధికారులు ఆపరేషన్ వేగవంతం చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో పసికూనలను తల్లి పులి వద్దకు తప్పక చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. తల్లి పులి సైకాలజీ ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులతో చర్చించిస్తున్నామన్నారు. ప్రస్తుతం నాలుగు పులి పిల్లలు అటవీ అధికారుల సంరక్షణలోనే ఉన్నాయి. ఆత్మకూరు DFO కార్యాలయంలో పులి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

నాలుగు కూనలతో పెద్ద పులి.. ఆహారం వెతుక్కుంటూ గుమ్మాడాపురం గ్రామ సమీపంలోని అడవిలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఊరి చివరిలో ఉన్న గోదాములో ఈ పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. కుక్కలు చూస్తే వాటిని బతకనివ్వవనే భయంతో ఊళ్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అధికారులకు సమాచారమిచ్చారు. ఊళ్లోకి ధైర్యంగా పులి కూనలను తీసుకెళ్లారు స్థానికులు. కానీ వాటిని వెతుక్కుంటూ తల్లి పులి వస్తే.. అన్న భయం వారిని వెంటాడుతోంది. తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలులేక మూడు పిల్లలు కొంత నీరసించాయి. ఐస్‌క్రీమ్‌, సెరెలాక్‌, పాలు ముందుంచినా అవి ముట్టలేదు. పులికూనలను తల్లితో కలిపేందుకు వాటిని అడవిలోకి వదిలినా అవి కదల్లేదు. వాటిని బైర్లూటి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అటవీ అధికారులు ప్రస్తుతం వాటి అలనా పాలనా చూస్తున్నారు. ఏసీ గదిలో ఉంచి.. ప్రతీ ఆరు గంటలకోసారి నోడల్‌ అధికారి పరిశీలిస్తున్నారు. తల్లి చెంతకు పిల్లల్ని చేర్చేందుకు వేర్వేరు బృందాల సాయం తీసుకుంటున్నామన్నారు ఫీల్డ్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 16, 2023 09:26 PM