అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయాన్ని ఆంధ్ర భద్రాద్రిగా గుర్తించారు. టీటీడీ 50 సంవత్సరాల అభివృద్ధి ప్రణాళికతో పాటు ఆలయానికి ఎదురుగా 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. యాత్రికుల సౌకర్యార్థం సంజీవరాయస్వామి ఆలయంతో సహా పరిసర ప్రాంతాలను సుందరీకరించేందుకు విస్తృత ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇది ఒంటిమిట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తుంది.
రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా భద్రాద్రిగా అధికారికంగా గుర్తించింది. ఒంటిమిట్ట అభివృద్ధి లో భాగంగా శ్రీకోదండరామాలయానికి ఎదురుగా ఉన్న చెరువులో108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట తోపాటు ఈ మార్గంలోని ఆలయాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్ధం 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని ఆమేరకు ప్రణాళికలు తయారు చేయాలని టీటీడీ అంకురార్పణ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఎంతో చారిత్రక ప్రాభవం ఉన్న శ్రీకోదండరామాలయాన్ని 2014లో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాద్రిగా ప్రకటించారు. ఈ ఆలయంలో సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడు ఒకే శిలపై విగ్రహాలు చెక్కడం వల్ల దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అప్పటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాల్లో పట్టాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కడప నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని అంగరంగ వైభవం గా తీర్చిదిద్దడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో జరిగే కల్యాణోత్సవానికి హాజరయ్యారు. అటు టీటీడీ చెరువులో జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇది ఒంటిమిట్టకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. దీంతో పాటు కడప – చెన్నై ప్రధాన రహదారికి ఓ పక్కన ఒంటిమిట్ట కోదండ రామాలయం మరో పక్కన సువిశాలమైనటువంటి 197 ఎకరాలలో ఒంటిమిట్ట చెరువు ఉంటుంది.సంజీవరాయస్వామి ఆలయం అభివృద్ధి.. ఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామ, లక్షణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల్లో అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళికను సిద్ధం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
