No Rain Village: వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!

|

Dec 11, 2023 | 10:14 AM

ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి వణికిస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఒకటుందని మీకు తెలుసా.? ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇది. ఈ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది.

ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి వణికిస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఒకటుందని మీకు తెలుసా.? ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇది. ఈ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడెక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకోలేని ఎత్తులో ఉండడమే.

సాధారణంగా మేఘాలు భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో ఉంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. అందుకే ప్రపంచంలో ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ అల్‌ బోహ్రా తెగలకు చెందిన ప్రజలుటారు. వీరిని యెమెన్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్‌ టూరిస్టులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.