వాషింగ్ మెషీన్ లోని సబ్బునీళ్లలో 15 ని.లపాటు తిరిగిన యేడాదిన్నర చిన్నారి !! చివరికి ??

|

Mar 01, 2023 | 9:45 AM

దేశ రాజధాని ఢిల్లీలో అద్భుత ఘటన జరిగింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ యేడాదిన్నర చిన్నారి చివరికి మృత్యుంజయుడుగా నిలిచాడు.

దేశ రాజధాని ఢిల్లీలో అద్భుత ఘటన జరిగింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ యేడాదిన్నర చిన్నారి చివరికి మృత్యుంజయుడుగా నిలిచాడు. వాషింగ్ మిషన్ లో పడిపోయిన ఆ చిన్నారి కోమాలోకి వెళ్లాడు. ఏడు రోజుల తర్వాత తిరిగి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఉతకడానికి ఇంట్లోని వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి.. ఆన్ చేసి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఆమె ఏడాదిన్నర కుమారుడు కనిపించలేదు. గదిలో ఉండాల్సిన బాబు కనిపించకపోవడంతో.. ఇల్లంతా వెతికింది. అనుమానంతో వాషింగ్ మిషన్లో చూడగా సబ్బు నీళ్లలో బాబు ఉండడం షాక్‌కు గురి చేసింది. అప్పటికే 15 నిమిషాల పాటు బాబు అందులోనే ఉన్నాడు. వెంటనే మిషన్ ని ఆఫ్ చేసి బాబును బయటకు తీసి కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే సబ్బు నీళ్లు, ఊపిరాడక ఆ చిన్నారి కోమాలోకి వెళ్లాడు. ఏడు రోజులపాటు వెంటిలేటర్ పై ఆ చిన్నారి మృత్యువుతో పోరాడాడు. ఆ తర్వాత మిరాకిల్ జరిగినట్టుగా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, చిన్నారి వాషింగ్ మెషిన్ లో ఎలా పడ్డాడు అనే దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దెబ్బకు దిగివచ్చిన HCA !! ఎన్టీఆర్ ఫ్యాన్సా.. మజాకా..

Koratala Siva: రాజమౌళి కారణంగా చిక్కుల్లో కొరటాల శివ !!

RC15: క్రేజీ అప్డేట్ !! RC15 ఫస్ట్ లుక్ లోడింగ్ !!

Samantha: షూటింగ్‌లో గాయపడ్డ సమంత !! నెట్టింట వైరల్

JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్‌ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!

 

Published on: Mar 01, 2023 09:45 AM