ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో
కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం. ఓనం పండుగ సందర్భంగా కేరళలోని ఒక కాలేజీలో ఓనం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కుర్చీ మడతబెట్టి పాటకు అక్కడి మలయాళి ముద్దుగుమ్మలు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డాన్స్ తో అలరించేశారు.
సాధారణంగా ఓనం రోజు కేరళీయులు పులికలి, తిరువాతిరకలి వంటి సంప్రదాయ నృత్యాలతో అలరిస్తారు. కానీ ఈసారి మలయాళి యువతులు తెలుగు సినిమా పాటకు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాటకు క్రేజీగా డాన్స్ చేయడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓనం పండుగ మలయాళీయులకు అత్యంత ఇష్టమైనది. ఓనం కేరళ సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు, సొంత గ్రామాల పట్ల మమకారానికి, వ్యవసాయానికి ముడిపడిన పండుగే ఓనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మలయాళీలకు అతిపెద్ద పండుగలలో ఒకటైన ఈ పండుగ ఆగస్టు 26న మొదలై సెప్టెంబర్ 5న ముగుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
భారీ వర్ష సూచన..వచ్చే 24 గంటల్లో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వీడియో
