National Award Winner: ఈ పేదరాలి బయోపిక్‌.. జాతీయ అవార్డుల హడావిడిలో ఓ బక్కచిక్కిన ముసలమ్మ..! (వీడియో)

|

Nov 07, 2021 | 4:18 PM

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బయోపిక్‌ల హవా ప్రతిబింబించింది. స్పెషల్‌ మెన్షన్ విభాగంలో 'లతా భగవాన్‌ కరే' అనే సినిమా జాతీయ అవార్డును దక్కించుకుంది. అదొక మరాఠా పేదరాలి జీవనచిత్రం. భారతీయ చలనచిత్ర పరిశ్రమంతా


67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బయోపిక్‌ల హవా ప్రతిబింబించింది. స్పెషల్‌ మెన్షన్ విభాగంలో ‘లతా భగవాన్‌ కరే’ అనే సినిమా జాతీయ అవార్డును దక్కించుకుంది. అదొక మరాఠా పేదరాలి జీవనచిత్రం. భారతీయ చలనచిత్ర పరిశ్రమంతా చర్చించుకునేలా చేసిన ఈ చిత్రాన్ని తెలంగాణ బిడ్డ నిర్మించాడు. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్‌ చేసిన ‘లతా భగవాన్‌ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్‌ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్‌ చేయగా, దానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన యువ దర్శకుడు దేశబోయిన నవీన్‌ పదో తరగతి విద్యార్థి. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి. కానీ, నవీన్‌ దృష్టిలో టాలెంట్‌ ముఖ్యం. మార్కులు, ర్యాంకులు కాదు. అందరూ ప్రిపరేషన్లో మునిగిపోయారు. ‘నాకు ఈ పరీక్షలొద్దూ.. ఈ చదువొద్దు’ అనుకున్నాడు. ఒకరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనుంచి పారిపోయాడు. అలా మొదలైన నవీన్‌, కృష్ణ ఎలా కలిశారు..67ఏళ్ల మహిళ కాళ్లకు చెప్పులు లేకుండా 150 కిలోమీటర్లు ఎలా పరిగెత్తింది. వారి మాటల్లోనే వింద్దాం..

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…