13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. అన్నం ముట్టదు !!
నచ్చిన వంటకాన్ని కడుపు నిండా తింటే అందులో ఉండే తృప్తే వేరు. కానీ 13 సంవత్సరాలుగా సుద్దగడ్డలే పరమాన్నంగా తింటోంది ఓ వృద్ధురాలు. రాజన్నసిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన చింతాకుల మల్లవ్వ వింత అలవాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్నానికి బదులు మూడు పూటలా చాక్‌పీసుల్ని తీసుకుంటూ జీవిస్తోంది. ఈ విచిత్రస్థితిని చూసిన కొడుకు, కోడలు మల్లవ్వను ఆసుపత్రికి తీసుకెళ్లగా మల్లవ్వను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు.
నచ్చిన వంటకాన్ని కడుపు నిండా తింటే అందులో ఉండే తృప్తే వేరు. కానీ 13 సంవత్సరాలుగా సుద్దగడ్డలే పరమాన్నంగా తింటోంది ఓ వృద్ధురాలు. రాజన్నసిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన చింతాకుల మల్లవ్వ వింత అలవాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్నానికి బదులు మూడు పూటలా చాక్‌పీసుల్ని తీసుకుంటూ జీవిస్తోంది. ఈ విచిత్రస్థితిని చూసిన కొడుకు, కోడలు మల్లవ్వను ఆసుపత్రికి తీసుకెళ్లగా మల్లవ్వను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. గత దశాబ్దన్నర కాలంగా ఊరులో ఉన్న ఒకే బావి నీరు త్రాగుతూ, అన్నానికి బదులు సుద్దగడ్డలను తింటూ జీవిస్తున్న మల్లవ్వను చూసి బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. చింతాకుల మల్లవ్వ – మల్లయ్య దంపతులది వ్యవసాయాధారిత కుంటుంబం. కొన్నేళ్ల క్రితం ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి చేరుకున్న మల్లవ్వ ఆకలిగా ఉండడంతో కంచంలో అన్నం పెట్టుకుని తినడానికి ప్రయత్నించగా అన్నం అస్సలు సహించలేదు. ఆపై ఆకలి వేయడంతో ఇంట్లో ఉన్న సుద్ద ముక్కల్ని నమిలి తినడం మొదలు పెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు
Chandrayaan-3: మూన్ మిషన్‌పై విక్రమ్ సారాభాయ్ వారసుని మాట..
Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ
Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి
Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ