జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు

Updated on: May 06, 2025 | 5:14 PM

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే యువతీ యువకులు పోలీసులను ఆశ్రయించి వారి సమక్షంలో వివాహం చేసుకోవడం చూశాం. కానీ ఇదొక విచిత్ర సంఘటన. జైల్లోనే ఓ ఖైదీ వివాహం చేసుకున్నాడు. అది కూడా అతనిపై కేసుపెట్టిన యువతినే మనువాడాడు. అసలు విషయం ఏంటంటే.. లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఆరు నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడిని.. అతడిపై కేసు పెట్టిన యువతి జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకుంది.

ఒడిశాలో జరిగిందీ ఘటన. జైలు అధికారుల వివరాలు ప్రకారం గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహరా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గతేడాది నవంబర్‌లో సూర్యకాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. నిందితుడు, బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. వారి పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం పెళ్లికి ఓకే చెప్పింది. దీంతో కొడాలా సబ్ జైలులో అధికారులు వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అయితే తుది తీర్పు వెలువడకపోవడంతో అప్పటి వరకు సూర్యకాంత్‌ జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాణం తీసిన చెవినొప్పి..

TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్‌.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ

ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్‌ వాసు అసహనం

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు.. ఇక చిప్ప కూడే గతి ??