Black Magic In School: పాఠశాలలో క్షుద్రపూజలు.. హడలిపోతున్న విద్యార్థులు, గ్రామస్థులు.. వీడియో వైరల్..

Updated on: Feb 19, 2023 | 10:06 AM

మహబూబూబాద్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని కురవి మండలం సూదనపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ పూజలు జరిగాయి. స్కూల్ ఉపాధ్యాయలుు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబూబాద్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని కురవి మండలం సూదనపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ పూజలు జరిగాయి. స్కూల్ ఉపాధ్యాయలుు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలోని తరగతి గది లోపల పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇలా స్కూల్లో చొరబడి క్షుద్ర పూజలు జరిపారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు గేట్లు లేకపోవడం వల్ల పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.ఈ మధ్య కాలంలో పలు పాఠశాలలో ఇలాంటి ఘటనలు తరచూ దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 10న కూడా హనుమకొండ భీమదేవర పల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఉదయం బీసీ కాలనీలోని కుదురుపాక రాజయ్య తెల్లవారుజామున నిద్ర లేచేసరికి, ఇంటి ముందు పూల చెట్టుకు తాయత్తు కట్టి కోడి తలతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 19, 2023 08:51 AM