ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో 7.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ 8.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 8.8, కామారెడ్డి జిల్లా గాంధారి 9.4, మెదక్ జిల్లా ఎల్దుర్తి 9.6, నిర్మల్ జిల్లా పెంబి 9.6, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట 9.8, నిజామాబాద్ జిల్లా సలోరాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో తొమ్మిది జిల్లాల్లో 10.2 నుంచి 10.9 మధ్య నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోనూ 13.2 డిగ్రీల లోపే నమోదయ్యాయి. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. 14 జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అటు మన్యంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. వికెండ్ కావడంతో మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకులు చేరుకొని సందడి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
