Nokia Flip Phone: బడ్జెట్ ధరకే నోకియా మడత ఫోన్.. ఫీచర్లివే..! మార్కెట్ లోకి వచ్చేది అప్పుడే..
నోకియా కంపెనీ మరో క్లాసిక్ ఫోన్‌ను ఆగస్టు 30న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నోకియా 2660 ఫ్లిప్ (Nokia 2660 Flip) పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను తీసుకొస్తుంది.
నోకియా కంపెనీ మరో క్లాసిక్ ఫోన్‌ను ఆగస్టు 30న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నోకియా 2660 ఫ్లిప్ (Nokia 2660 Flip) పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను తీసుకొస్తుంది. ఈ ఫోన్ ధర ₹ 5 వేల నుంచి ₹ 10 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. మరి నోకియా ఫ్లిప్ ఫోన్‌లో ఫీచర్లేంటో చూసేద్దామా. నోకియా 2660 ఫ్లిప్ కాయ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఫోన్ తెరిచినప్పుడు పై భాగంలో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, కింద కీబోర్డ్ ఇస్తున్నారు. ఫోన్ మూసినప్పుడు ముందు భాగంలో 1.77 అంగుళాల క్యూక్యూబీజీఏ స్క్రీన్, ఫ్లాష్ లైట్‌తో 0.3 ఎంపీ కెమెరా ఉన్నాయి. 4జీని సపోర్ట్ చేస్తుంది. యూనిసాక్ టీ107 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.75 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో సుమారు ఏడు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ ఫీచర్లున్నాయి. 48 ఎంబీ ర్యామ్ ఇంకా 128 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొస్తున్నారు. 32 జీబీ మెమొరీ కార్డును సపోర్ట్ చేస్తుంది. బ్లూ, రెడ్, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)