Viral: తప్పతాగి యువతి హల్చల్‌.. సెక్యూరిటీ గార్డుపై దాడి

Viral: తప్పతాగి యువతి హల్చల్‌.. సెక్యూరిటీ గార్డుపై దాడి

Phani CH

|

Updated on: Aug 27, 2022 | 9:51 AM

ఢిల్లీలోని నోయిడాలో మద్యం మత్తులో హల్చల్‌ చేసింది ఓ యువతి. హౌసింగ్‌ సోసైటీ సెక్యూరిటీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది భవ్యరాయ్‌ అనే యువతి.

ఢిల్లీలోని నోయిడాలో మద్యం మత్తులో హల్చల్‌ చేసింది ఓ యువతి. హౌసింగ్‌ సోసైటీ సెక్యూరిటీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది భవ్యరాయ్‌ అనే యువతి. బండబూతులు తిడుతూ.. చిన్న విషయానికి నానా రచ్చ చేసింది. గేటు తీయడానికి ఆలస్యం కావడంతో భవ్య రాయ్‌ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్‌ను చోక్కా కాలర్‌ పట్టుకుని భవ్యరాయ్‌ కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వాళ్లపై కూడా చిందులు వేసింది. ఇక సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ భవ్యరాయ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్‌లా మారిపోయిన ఆమె చర్మం

యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..

స్టూడెంట్‌ను కిడ్నాప్‌ చేసిన యువతి.. ఈ హనీట్రాప్‌ ఎలా జరిగిదంటే

Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..

తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్‌ !! నెట్టింట వీడియో వైరల్

 

Published on: Aug 27, 2022 09:51 AM