గాయపడిన శునకం..అడ్డురాని పేదరికం.. పిల్లలు ఏం చేశారంటే?
గాయపడిన కుక్కను చూసి ఇద్దరు పిల్లలు చలించిపోయారు. అట్టపెట్టతో బండిని తయారుచేశారు. గాయంతో బాధపడుతున్న కుక్కను అందులో ఉంచి పశువైద్యశాలకు తీసుకువెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో ఈ సంఘటన జరిగింది. మరో కుక్క కరవడంతో వీధి కుక్క గాయపడటాన్ని ఇద్దరు పిల్లలు చూశారు. అట్టపెట్టుతో చక్రాల బండిని తయారుచేశారు. కుక్కను అందులో ఉంచి పశువైద్యశాలకు తరలించారు. ఆ పిల్లల దగ్గర డబ్బులు లేవు. అయినా సరే కుక్కను బాధ నుంచి తప్పించాలి, నయం చేయాలన్న ఆలోచనతో హాస్పిటల్ కు వెళ్లారు. పెద్దలు వీరిలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించారు.
చికిత్స తర్వాత అట్టపెట్ట బండీలో దాన్ని ఉంచి ఇంటికి తిరిగి వెళుతుండగా దారిలో ఓ వ్యక్తి వారిని ఆపి వివరాలు అడిగాడు. కుక్కను డాక్టర్ కు చూపించి చికిత్స చేయించామని ఓ బాలుడు అన్నాడు. మళ్లీ తీసుకురావాలని డాక్టర్లు సూచించారని తెలిపాడు. పెద్ద పిల్లవాడు తాడుతో ఆ బండిని లాగగా చిన్న పిల్లవాడు వెనుక నుంచి దాన్ని తోశాడు. కాగా గాయపడిన కుక్కకు చికిత్స కోసం అట్టపెట్ట బండిలో ఉంచి మండుటెండలో వెటర్నరీ హాస్పిటల్ కు పిల్లలు తీసుకెళ్ళిన ఈ సంఘటనను ఆ వ్యక్తి రికార్డు చేశాడు. మే 14న స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 2,30,000 వ్యూస్ 25,000 లైక్స్ వచ్చాయి. పేదరికంలో ఉన్న ఆ ఇద్దరు పిల్లలు జంతువుల పట్ల ఆ పిల్లలు చూపిన ప్రేమ దయకు నెటిజన్లు ముగ్ధులయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
