Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: బెంగళూరు ఉద్యోగులను చేసుకోము కచ్చితంగా చెప్పేస్తున్న అమ్మాయిలు..

Bengaluru: బెంగళూరు ఉద్యోగులను చేసుకోము కచ్చితంగా చెప్పేస్తున్న అమ్మాయిలు..

Anil kumar poka

|

Updated on: Mar 14, 2024 | 4:10 PM

బెంగళూరు నగరంలో నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాకముందే పరిస్థితి దారుణంగా మారింది. ఇక పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదంటూ యువకులు వాపోతున్నారు. సోషల్‌ మీడియాలో విచారంగా పోస్టులు పెడుతున్నారు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితుడికి అమ్మాయి దొరకడం లేదని తాజాగా ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు.

బెంగళూరు నగరంలో నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాకముందే పరిస్థితి దారుణంగా మారింది. ఇక పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదంటూ యువకులు వాపోతున్నారు. సోషల్‌ మీడియాలో విచారంగా పోస్టులు పెడుతున్నారు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితుడికి అమ్మాయి దొరకడం లేదని తాజాగా ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. బెంగళూరుకి వచ్చి ఉండలేమని అమ్మాయిలు కచ్చితంగా చెప్పేస్తున్నారని తన పోస్టును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్‌ చేశాడు. బెంగళూరులో నీటి సమస్యను రాహుల్‌గాంధీ పరిష్కరించాలనీ, ఐటీ ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడు వధువు కోసం ఎంత గాలించినా ఫలితం లేదనీ సిలికాన్‌ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన స్నేహితుడు తనతో బాధపడినట్లు పోస్ట్‌లో రాసుకొచ్చాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్‌ సిటీకి చుక్కలు చూపిస్తోందనీ గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చిందనీ వాపోయాడు. బెంగళూరులో నీటిని సరఫరా చేయడానికి జలమండలి శ్రమిస్తున్నా అది ఏ మూలకూ సరిపోవడం లేదు. దాదాపు లక్ష బోర్లు ఎండిపోవడంతో నగరంలోని 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..