అరుదైన దెయ్యం చేప !! ఆశ్చర్యపోయిన పరిశోధకులు.. వీడియో
ఇప్పడు మనం ఒక దెయ్యం చేప గురించి తెలుసుకోబోతున్నాం. సముద్రాల్లో ఉండే అనేక రకాల జీవుల్లో దెయ్యం చేప కూడా ఒకటి. నిజానికి ఇదోరకమైన షార్క్ చేప.
ఇప్పడు మనం ఒక దెయ్యం చేప గురించి తెలుసుకోబోతున్నాం. సముద్రాల్లో ఉండే అనేక రకాల జీవుల్లో దెయ్యం చేప కూడా ఒకటి. నిజానికి ఇదోరకమైన షార్క్ చేప. దీనిని సైంటిస్టులు న్యూజిలాండ్ లోని తూర్పు సముద్ర తీరంలో కనిపెట్టారు. ఇది సముద్రాల్లో అత్యంత లోతున కనిపించే చేప. దీన్ని చిమారా అని కూడా పిలుస్తారు. ఈ చేపలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. వీటిని దెయ్యం చేప అని పిలవడానికి ఓ కారణం ఉంది. వీటి శరీరం లోపలి భాగాలు బయటకు కనిపిస్తాయి. చూడటానికి ఇవి భయంకరంగా ఉంటాయి. అందుకే వీటిని అలా పిలుస్తారు. అలాగే “ఈ చేపలు రహస్యంగా తిరుగుతూ ఉంటాయి. వీలైనంతవరకూ బయటి ప్రపంచంలోకి రావు. అందుకే వీటిని కనిపెట్టడం చాలా కష్టం. పనిగట్టుకొని వెళ్లి వెతికినా కనిపించవని పరిశోధకులు చెబుతున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos