Bride dance Viral Video: పెళ్లిలో డాన్స్‌ అదరగొట్టిన వధువు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఆకట్టుకుంటున్న వీడియో..

|

Mar 04, 2022 | 9:33 PM

ఇటీవల సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయం క్షణాల్లో ప్రపంచం నలుమూలలకూ చేరిపోతోంది. ఈ సోషల్‌ మీడియా విషయ పరిజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతోంది. ఈ క్రమంలో అనేక ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పెళ్లిళ్లకు


ఇటీవల సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయం క్షణాల్లో ప్రపంచం నలుమూలలకూ చేరిపోతోంది. ఈ సోషల్‌ మీడియా విషయ పరిజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతోంది. ఈ క్రమంలో అనేక ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిలో వధూవరుల డాన్స్‌లు.. సరదా సన్నివేశాలను వీక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ పెళ్లి కూతురు.. చకా చక్ అంటూ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. . కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ వధువు.. తన పెళ్లి రోజున ..సారా అలీ ఖాన్‌ అత్రంగి రే చిత్రంలోని ఈ పాటకు ఆమె వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ వైరల్ అవుతున్నాయి. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ వధువు.. తన పెళ్లి రోజున ఈ పాటకు చేసిన డ్యాన్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోలో వధువు రెంజితా ఆర్ నాయర్ ఆమె పక్కన ఉన్న మరికొందరితో కలిసి ఆమె చకా చక్‌కి స్టెప్పులేసారు. వధువు డ్యాన్స్ చేస్తూ.. పాటకు అనుగుణంగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తుంది. ఆమె డాన్స్‌కు వరుడు సైతం ఫిదా అయిపోయాడు.. వధువును చూసి నవ్వుతూ ఎంజాయ్‌ చేశాడు తప్ప డాన్స్ వేయలేదు. ఇదంతా అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ఈ వైరల్ వీడియోను ఫోటోగ్రాఫర్ జెరీ జాకబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి 11న షేర్ చేశారు. అప్పటి నుండి ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్లకు పైగా వీక్షించారు. అంతేకాకుండా వధువును అభినందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్