Viral Video: సీసీ కెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ సీన్.. ఏలియన్‌లా ఉందంటున్న నెటిజనం.
కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యకరమైన, షాకింగ్ దృశ్యాలను చూస్తుంటాం. మెరుపు వేగంలో కనిపించి వెళ్లే వాటిని చూసి ఆశ్చర్యపోతుంటాం. ఆకాశంలో తోక చుక్కలు చూస్తుండగానే ఒక మెరుపు మెరిసి, కనుమరుగవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో వెలుగు చూసింది. అయితే, ఇది ఆకాశంలో తోక చుక్క మాత్రం కాదు. ఓ ఇంటి ఆవరణలో రాత్రి వేళ విచిత్రమైన ఆకారం కనిపించింది.
కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యకరమైన, షాకింగ్ దృశ్యాలను చూస్తుంటాం. మెరుపు వేగంలో కనిపించి వెళ్లే వాటిని చూసి ఆశ్చర్యపోతుంటాం. ఆకాశంలో తోక చుక్కలు చూస్తుండగానే ఒక మెరుపు మెరిసి, కనుమరుగవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో వెలుగు చూసింది. అయితే, ఇది ఆకాశంలో తోక చుక్క మాత్రం కాదు. ఓ ఇంటి ఆవరణలో రాత్రి వేళ విచిత్రమైన ఆకారం కనిపించింది. అది ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్‌ని పరిశీలించిన ఇంటి యజమాని ఆ వింత ఆకారం చూసి అవాక్కయ్యాడు. ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సరిగ్గా రాత్రి 10 గంటల 09 నిమిషాలకు సీసీ కెమెరా ముందు నుంచి వింత జీవిని పోలి ఉన్న ఆకారం దూసుకెళ్లింది. రెప్పపాటు సమయంలో దూసుకెళ్లిన ఆ వింత ఆకారాన్ని స్లో మోషన్‌లో చూసి షాక్ అయ్యాడు ఇంటి యజమాని. నెటిజన్లు సైతం ఆ ఆకారాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఇదేదో ఏలియన్‌లా ఉందేంటి? అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వింత ఆకారం ధగధగా మెరుస్తూ యూఎఫ్ఓ లా స్పీడ్‌గా వెళ్లంతో గ్రహాంతర జీవి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

