Bike ride: అది బైకా.. ఆర్టీసీ బస్సా.. ఏంది సామీ ఇదీ..! ఒకే బైక్‌పై ఏకంగా 12 మంది దూసుకెళ్తున్న యువకులు..

|

Oct 05, 2022 | 5:50 PM

సాధారణంగా బైక్ మీద ఇద్దరు వెళ్తేనే ఇద్దరూ హెల్మెట్‌ పెట్టుకోవాలి.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పైన ప్రయాణించకూడదు అంటూ పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అదే క్రమంలో రోడ్డు

అది బైకా.. ఆర్టీసీ బస్సా..! ?? - TV9
సాధారణంగా బైక్ మీద ఇద్దరు వెళ్తేనే ఇద్దరూ హెల్మెట్‌ పెట్టుకోవాలి.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పైన ప్రయాణించకూడదు అంటూ పోలీసులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. అదే క్రమంలో రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రయాణిస్తే వారిని పట్టుకొని జరిమానా విధిస్తారు. కానీ పోలీసులు, అధికారులు ఈ ప్రయాణాల విషయంలో ఎంతగా అవగాహన కలిగించినా కొందరు పెడచెవిన పెడుతుంటారు. ఈమధ్య సోషల్‌ మీడియా ఒకటి బాగా అందరికీ అందుబాటులోకి రావడంతో ఇంకా రెచ్చిపోతున్నారు కొందరు. పరిమితికి మించి బైకులపై ప్రయాణిస్తూ.. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారితో పాటుగా ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక బైకు రోడ్డుపైన దూసుకుపోతోంది. దానిపైన ఒకటి, రెండు, మూడు.. కాదు ఏకంగా 12 మందికి పైనే ఆ బైక్‌పైన కూర్చున్నారు. ఆ బైక్‌ నడిపే వ్యక్తి యూడా ఎంతో బ్యాలెన్సింగ్‌ గా వేగంగా బైక్‌ నడుపుతున్నాడు. అదుపు తప్పితే అడ్రస్‌ గల్లంతే అన్న రేంజ్‌లో దూసుకుపోతున్నారు. వారినిచూసి మిగతా వాహనదారులు వారిని హెచ్చరిస్తున్నారు కూడా. అయినా వారు పట్టించుకోవడం లేదు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. లక్షలమంది ఈ వీడియోను వీక్షిస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అది బైకా.. ఆర్టీసీ బస్సా.. ఏంది సామీ ఈ విపరీత ధోరణి తగదంటూ మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!