పూజ గదిలో అస్సలే పెట్టకూడని వస్తువు ఇదే వీడియో
ఇంట్లోని ప్రతి గదికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటిలో పూజాగది అనేది అత్యంత పవిత్రమైన స్థలం. ఇది దేవుని ఆరాధన కోసం మాత్రమే కాకుండా ఇంట్లో శుభశక్తిని ఆకర్షించే పవిత్ర స్థలంగా గుర్తించబడుతుంది. అలాంటి గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఉండకూడదనే దానిపై స్పష్టమైన నియమాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా అగ్గిపెట్టె వంటి వస్తువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అగ్గిపెట్టెను పూజాగదిలో ఉంచడం అనేది ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. పూజాగది శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండే ప్రదేశం. అలాంటి చోట అగ్గిపెట్టె ఉంచడం మంచిది కాదంటున్నారు.
పూజాగదిలో అగ్గిపెట్టె ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి బలహీనపడుతుందని, ఇంట్లో మానసిక శాంతి లోపించడం, ఆర్థిక సమస్యలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య మాటపట్టింపులు, మనస్పర్థలు పెరగడం వంటి ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. అగ్గిపెట్టెను వంటగదిలో ఉంచడమే మంచిదంటున్నారు. అగ్గిపెట్టె వంటగదిలో ఉన్నప్పుడు ఇది ఆశీర్వాదంగా మారుతుందని నిపుణుల అభిప్రాయం. ఏదైనా అత్యవసరంగా పూజాగదిలో అగ్గిపెట్టె ఉంచాల్సిన పరిస్థితి వస్తే దాన్ని కేవలం ఓ బట్టలో చుట్టి పైకి కనిపించకుండా పెట్టాలి. అంతేకాదు ఉత్తర లేదా తూర్పు దిశల్లో మాత్రమే పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత వాడిన అగ్గిపుల్లలను అలాగే వదిలేయడం దురదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. పూజాగదిని ఎప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు దీపం వెలిగించాలి. మంత్రాలను పఠించడం వల్ల ఆ గదిలో సానుకూల శక్తి నిలిచిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం :
డేగాకు పాస్ పోర్ట్.. ఏ దేశం ఇచ్చిందంటే వీడియో
బస్సును ఢీ కొట్టిన బైక్..సీన్ కట్ చేస్తే వీడియో
షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే అధిక ప్రోటీన్ వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
