Siddipet: అమానుషం.! వారికి సెలూన్‌లో కటింగ్‌ వేయమన్న నాయీబ్రాహ్మణులు..

Edited By:

Updated on: Jul 12, 2023 | 6:56 PM

టెక్నాలజీ యుగంలోనూ జనం కుల వివక్షను వీడటంలేదు. మనిషి అభివృద్ధి పరంగా ఎంతగా ఎదిగినా కులం, మతం, వర్ణం, వర్గం అంటూ నానాటికీ కుంచించుకుపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన.

టెక్నాలజీ యుగంలోనూ జనం కుల వివక్షను వీడటంలేదు. మనిషి అభివృద్ధి పరంగా ఎంతగా ఎదిగినా కులం, మతం, వర్ణం, వర్గం అంటూ నానాటికీ కుంచించుకుపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన. అవును జిల్లాలోని జగ్‌దేవ్‌పూర్‌ మండలంల తిమ్మాపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నాయీ బ్రాహ్మణులు దళితులను తమ సెలూన్లలో కటింగ్‌ వేయమని తేల్చి చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే అది మా కట్టబాటు అని చెప్పారు.

గత కొన్ని రోజులుగా ఈ కుల వివక్షతో తమకు సెలూన్లలో కటింగ్‌ వేయడానికి నిరాకరిస్తున్నారని బాధిత దళితులు ఆరోపించారు. అగ్ర కులస్తులకు మాత్రమే సెలూన్ల లోపలికి అనుమతిస్తామని, దళితులకు లోపలికి అనుమతి లేదంటూ, చెట్లకింద కూర్చోబెట్టి వారికి క్షవరం చేస్తున్నారు నాయీ బ్రాహ్మణులు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే అది వారి యూనియన్‌ తీర్మానమని చెబుతున్నారు. దాంతో చేసేది లేక బాధితులు చెట్లకిందే కటింగ్‌ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు దళిత కుటుంబీకులు, బాధితులతో కలిసి జగదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 12, 2023 06:33 PM