Tirumala: అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Aug 24, 2024 | 9:36 AM

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు..

తిరుమల వెంకన్న ఎంతో పవర్‌ఫుల్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. పౌత్‌కి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు.. కొండకు కాలినడకన వెళ్లి  స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. అయితే ఆయన మాస్క్ పెట్టుకుని ఉండటంతో తొలుత ఎవరూ గుర్తుపట్టలేదు. దారిలో ఓసారి మాస్క్ తీసివేయడంతో.. భక్తులు గుర్తుపట్టి సెల్పీల కోసం ఎగబడ్డారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు. నేచురల్ స్టార్ నాని. అవును.. నాని.. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడక‌మార్గంలో నానితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నాని. ఆయన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’  ఈ నెల 29న విడుదల కానుంది. తన నుంచి వైవిధ్యమైన సినిమాలను కోరుకునే ప్రేక్షకుల కోసం సరిపోదా శనివారం మూవీని చేసినట్లు నాని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..