అంతుచిక్కని వ్యాధితో వందలమంది మృతి.! పిల్లలకే ఎక్కువగా సోకుతోందన్న వైద్యులు..

|

Dec 14, 2024 | 3:15 PM

ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 143 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్యే ఎక్కువని తెలిపారు. వ్యాధి ఎందుకు, ఎలా సోకుతోందనే వివరాలు డాక్టర్లకు కూడా తెలియడంలేదట. ఈ మిస్టరీ వ్యాధిని వారు ‘డిసీజ్ ఎక్స్’ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్ లో డిసీజ్ ఎక్స్ కేసులు 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తుచేశారు. ఈ కారణంగానే డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోందనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నిపుణులు వివరించారు. ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని డబ్ల్యూహెచ్ వో ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ వ్యాధి లక్షణాలు చూస్తే.. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, దగ్గు, జలుబుతో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.