మెదడుకు సంబంధించిన వింత వ్యాధి హడల్.. ఇప్పటికే ఆరుగురు మృతి.. వీడియో
కరోనా వైరస్ భయాల నుంచి ఇంకా కోలుకోక ముందే.. మెదడుకు సంబంధించిన అంతుచిక్కని ఓ వింత వ్యాధి ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 48 మంది ఈ వ్యాధితో అనారోగ్య బారినపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
కరోనా వైరస్ భయాల నుంచి ఇంకా కోలుకోక ముందే.. మెదడుకు సంబంధించిన అంతుచిక్కని ఓ వింత వ్యాధి ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 48 మంది ఈ వ్యాధితో అనారోగ్య బారినపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. వీరు మతిమరుపు, తికమకపడటం, ఒత్తిడికి లోనుకావడం, కండరాల నొప్పులు వంటి న్యూరో సిండ్రోమ్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. ఈ వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారినపడుతున్న రోగులు.. తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ అంతుచిక్కని వ్యాధి కెనడా దేశంలోని బ్రన్‌స్విక్ ప్రావిన్స్‌లో వెలుగుచూసింది…ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఆరుగురు మరణించినట్లు సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: South China Sea: సౌత్ చైనా సముద్ర గర్భంలో అలజడి.. అమెరికా జలాంతర్గామికి ప్రమాదం.. వీడియో
Perseverance Rover: అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు.. వీడియో