Uttar Pradesh : నా చెప్పులు పోయాయి..వెతికి పెట్టాలని పోలీసులకు కంప్లైంట్.. కేసు నమోదు.

|

Jul 15, 2023 | 7:29 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. నగరంలోని ఓ వ్యక్తి తన చెప్పుడు పోయాయి వెతికి పెట్టండి అంటూ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. అవును, వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. సదరు వ్యక్తి తాను చాలా నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ చెప్పులు కొనుక్కున్నానని,

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దబౌలి ప్రాంతానికి చెందిన కాంతిలాల్ నిగమ్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం సివిల్ లైన్‌లోని భైరవ బాబా ఆలయంలో దేవుడి దర్శనం కోసం వెళ్ళాడు. ఆలయ సమీపంలోని ఓ దుకాణం నుంచి పూజ సామగ్రిని తీసుకొని, చెప్పులను గుడి బయట విడిచి లోపలికి వెళ్లాడు. పూజలు ముగించుకుని తిరిగి వచ్చి చూసేసరికవి తన చెప్పులు కనిపించకుండా పోయాయి. కంగారు పడ్డ కాంతిలాల్‌ పక్కనే ఉన్న చెప్పులన్నిటిని వెతికాడు.. చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా అడిగాడు. అయితే చెప్పుల జాడ దొరకలేదు. దీని తరువాత కాంతిలాల్ చెప్పుల దొంగతనానికి సంబంధించి కాన్పూర్ పోలీసుల ఇ-పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించిందని కాంతిలాల్‌ అన్నారు. తాను సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఓ పౌరుడిగా ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నానని పేర్కొన్నాడు. కాంతిలాల్‌ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, దొంగతనం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని, దొంగతనం జరిగితే కేసు నమోదు చేయడం అందరి హక్కుఅని, అందుకే చెప్పుల చోరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. నిందితుడికోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...