Hajj Trip: హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!

|

Jun 17, 2024 | 12:36 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాంతం మక్కా. తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ముస్లింలు భావిస్తారు. సౌదీ అరేబియాలో ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ తాజాగా శుక్రవారం ముస్లింల వార్షిక హజ్‌ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాంతం మక్కా. తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ముస్లింలు భావిస్తారు. సౌదీ అరేబియాలో ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ తాజాగా శుక్రవారం ముస్లింల వార్షిక హజ్‌ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. మీనా నుంచి వీరంతా శనివారం అరాఫత్‌ పర్వతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశముందని సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు సూచనలు జారీ చేసింది. ఈదుల్‌ అధా అంటే బక్రీద్‌ నాటికి వీరంతా తిరిగి మీనాలో ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన 15 లక్షలకు పైగా భక్తులు హజ్‌ యాత్రకు తరలివచ్చారు.

వీరికి స్థానికులు కూడా తోడవటంతో ఈ ఏడాది యాత్రికుల సంఖ్య 20 లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ గాజా భూభాగంలో ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఈ ఏడాది హజ్‌ యాత్రకు ఇంత మంది రావడం గమనార్హం. ఈసారి హజ్ యాత్ర కోసం భారత్, సౌదీ అరేబియా ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో 2024లో ఈ యాత్ర కోసం భారత్ నుంచి 1,75,025 మంది వెళ్లనున్నారు. హజ్ యాత్ర ప్రయాణంలో భాగంగా మొదట తీర్థయాత్రకు ఆరు నెలల ముందే బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.