Muniyandi Temple: మీ చిరకాల కోరికలు నెరవేరాలా.. అయితే అక్కడ బిర్యానీ తినాల్సిందే.. ప్రసాదంగా బిర్యానీ.
తమిళనాడులోని మధురైలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో ఉనన కుల్లికుడి వడకంపట్టి అనే గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు మునియాండి స్వామిని తమ కులదైవంగా పూజిస్తుంటారు.
తమిళనాడులోని మధురైలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో ఉనన కుల్లికుడి వడకంపట్టి అనే గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు మునియాండి స్వామిని తమ కులదైవంగా పూజిస్తుంటారు. ఏటా మునియాండి స్వామికి ఘనంగా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించ లేదు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బిర్యాని విందు అట్టహాసంగా సాగింది. ఉత్సవం సందర్భంగా స్వామివారికి బిర్యానీని నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆచారం.ఈ క్రమంలో పెద్ద ఎత్తున పాలబిందెలతో ఊరేగింపు నిర్వహించి, అతిపెద్ద కత్తులను ఆలయానికి సమర్పించారు భక్తులు. అనంతరం 50 గ్రామాలకు చెందిన భక్తులకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. 74 మేకలను, 200కు పైగా కోళ్లు, 2,500 కేజీల బియ్యంతో బిర్యాని తయారు చేసి స్వామివారికి సమర్పించి అనంతరం ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టారు. ఇక్కడి బిర్యాని కోసం జనం ఎగబడ్డారు. ఈ బిర్యాని తింటే పెళ్లి కాని వారికి త్వరగా వివాహాలు జరుగుతాయని, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు వెల్లడించారు. ఇక్కడి స్వామివారి ప్రసాదం మహిమాన్వితమైనదని, మునియాండి స్వామికి మొక్కులు చెల్లించి బిర్యానీ ప్రసాదం స్వీకరిస్తే తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని స్వామి వారి పేరిట రాష్ట్రవ్యాప్తంగా మునియాండి విలాస్‌లను నడుపుతున్నామని, రోజూ తమ హోటల్‌లో తొలి బిల్లు రూపంలో వచ్చే మొత్తా న్ని ఆలయం కోసం తాము కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..