Mother Love : ఈ వీడియో చూస్తే మీరు తప్పక ఎమోషనల్‌ అవుతారు..! తల్లడిల్లిన తల్లి సింహం.. వీడియో

|

Mar 10, 2022 | 1:19 PM

ప్రతిరోజూ నెట్టింట మనం రకరకాల వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూసినప్పుడు ఎమోషనల్‌ అవుతాం. ఎందుకంటే అందులో ఉండే కంటెంట్‌ అలాంటిది. ఇదిగో తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో తల్లి ప్రేమకు అద్దం పడుతోంది.


ప్రతిరోజూ నెట్టింట మనం రకరకాల వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూసినప్పుడు ఎమోషనల్‌ అవుతాం. ఎందుకంటే అందులో ఉండే కంటెంట్‌ అలాంటిది. ఇదిగో తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో తల్లి ప్రేమకు అద్దం పడుతోంది. సృష్టిలో కల్తీ లేనిది, స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే అనడం అతిశయోక్తి కాదు. ఇందుకు మనుషులే కాదు, పశుపక్ష్యాదులు కూడా అతీతం కాదు. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియో ఇందుకు సాక్ష్యమని చెప్పొచ్చు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అడవి ప్రాంతంలో ఓ నీటి కుంట ఉంది. అక్కడికి నీళ్లు తాగడానికి ఓ సింహం తన పిల్లలను వెంటబెట్టుకుని వచ్చింది. అయితే ఆ నీటి కుంట చుట్టూ ఎత్తయిన గట్టు ఉండటంతో అక్కడినుంచి తిరిగి వెళ్లే సమయంలో ఆ సింహం పిల్లలు పైకి ఎక్కలేకపోయాయి. పాపం ఎంత ప్రయత్నించినా కిందకు జారిపడుతున్నాయి. అయితే గట్టుపైన ఉన్న తల్లి సింహం.. తన పిల్లల ఇబ్బందిని గమనించింది. వెంటనే కిందకు దిగింది. రెండు పిల్లలను నోట కరుచుకుని.. ఒక్క ఉదుటున పైకి దూకింది. తన పిల్లలను సేఫ్‌గా పైకి తీసుకువచ్చింది. పిల్లలు రెండూ పైకి రావడంతో ఆ తల్లి సింహం హాయిగా వాటితో ఆడుకుంటూ ముందుకు కదిలింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. భావోద్వేగాన్ని కలిగించే ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తల్లి ప్రేమ ముందు మరే ప్రేమైనా తక్కువే అని కామెంట్స్ పెడుతున్నారు

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..