ప్రాణాలు కాపాడిన డ్రోన్లు.. ఎలాగో వీడీయో మీరే చూడండి

Updated on: Oct 31, 2025 | 9:00 AM

మొంథా తుఫాన్‌ దాటికి ఏపీ విలవిలలాడింది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొంథా తుపాను విధ్వంసం సృష్టించింది. కుంభవృష్టిగా కురిసిన వర్షానికి నేల ఆకాశం ఒక్కటైపోయింది. గంటకు 70 కి.మీ. వేగంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కరెంటు సరఫరా నిలిచి అంతటా అంధకారం నెలకొంది.

వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. తుఫాన్‌ అనంతరం టెక్నాలజీ ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. మొంథా తుఫాను సహయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగించింది ప్రభుత్వం. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతోన్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి, కాపాడారు అధికారులు. వెంటనే అలర్టు కావడంతో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని పోలీసులు రక్షించారు. ఇదే కాకుండా.. లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పోలీసులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా ప్రమాదకర పరిస్థితులుంటే అధికార యంత్రాంగం వెంటనే అలెర్ట్ అవుతోంది. కొన్ని చోట్ల కొట్టుకుపోతున్న పశువులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఒడ్డుకు చేర్చారు. భవనాలపై చిక్కుకున్న వారికి ఆహార సామగ్రిని డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు

మొంథా ఎఫెక్ట్‌.. పాఠశాలలకు సెలవు

బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??

జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు

చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్‌