Monster lizard fight: నడిరోడ్డుపై రాక్షస బల్లుల కుస్తీ.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న అరుదైన వీడియో..

Updated on: Sep 03, 2022 | 9:48 PM

కుక్కపిల్లలో, పిల్లులో కొట్టుకోవడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. రెండు బల్లులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..బల్లులు కొట్టుకోవడం పెద్ద విశేషమా అనుకోకండి.. ఇలాంటి బల్లుల్ని చూడ్డం చాలా అరుదు.


కుక్కపిల్లలో, పిల్లులో కొట్టుకోవడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. రెండు బల్లులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..బల్లులు కొట్టుకోవడం పెద్ద విశేషమా అనుకోకండి.. ఇలాంటి బల్లుల్ని చూడ్డం చాలా అరుదు. ఇది గోడమీద పాకే చిన్న చిన్న బల్లులు కాదండి బాబు… బల్లి జాతుల్లోనే అతిపెద్ద మానిటర్‌ బల్లులు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి రెండు బల్లులు నడిరోడ్డుమీద కలబడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..భూమ్మీద అతిపెద్ద బల్లి జాతుల్లో మానిటర్ లిజర్డ్స్ ఒకటి. తోకతో కలిపి రెండు మీటర్ల వరకు పొడవు పెరిగే ఈ రకం బల్లులు.. థాయిలాండ్ లో సహజంగానే కనిపిస్తుంటాయి. వీటిలో మగ బల్లులు ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం రెజ్లింగ్ తరహాలో పోట్లాటకు దిగుతాయి. ఈ క్రమంలోనే ఇటీవల రెండు మగ బల్లులు నడి రోడ్డుపైకి వచ్చాయి. కౌగిలించుకున్నట్టుగా గట్టిగా ఒకదాన్ని మరొకటి పట్టుకుని నిలబడ్డాయి. దాంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక కారులో వెళుతున్న వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. మొదట చూసినవారికి బల్లులు కౌగిలించుకున్నట్టుగానే కనిపిస్తాయి. కానీ అవి రెండూ మగ బల్లులు అని.. తమ ఆధిపత్యం చూపడం కోసం పోరాడుతున్నాయని స్థానికులు చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ దీనిని ప్రసారం చేసింది కూడా. ఇటీవల భారత ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా కూడా ఇలాంటి ఓ భారీ బల్లుల వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. దాన్ని చూసినవారు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 03, 2022 09:48 PM