తాజాగా కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యాపారి తన షాపులో వచ్చేందుకు యత్నిస్తున్న కోతులను తరమేందుకు ప్రయత్నించారు. దుకాణం ముందు నుంచి వెళ్తున్న ఓ కోతిని కర్రతో కొట్టబోయాడు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కోతుల గుంపు ఒక్కసారిగా అతనిపై దూకి దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos