ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కోతుల విశ్వరూపం.. కోతుల బెడద నివారణ కోసం కొండముచ్చు రంగంలోకి.. వీడియో
వానర చేష్టలతో పల్లె, పట్నం అనే తేడాలేకుండా అందరూ హడలెత్తిపోతున్నారు..ఇండ్లు, దుకాణాలు, షాపులు, పంటపొలాలను నాశనం చేస్తూ...కోతులు చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు...కోతి పనులతో రైతులు జనాలు బెంబేలెత్తిపోతున్నారు..
వానర చేష్టలతో పల్లె, పట్నం అనే తేడాలేకుండా అందరూ హడలెత్తిపోతున్నారు..ఇండ్లు, దుకాణాలు, షాపులు, పంటపొలాలను నాశనం చేస్తూ…కోతులు చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు…కోతి పనులతో రైతులు జనాలు బెంబేలెత్తిపోతున్నారు..ఇక కోతులు గుంపుగా ఉన్నాయంటే…అక్కడ మాములు అల్లరి ఉండదు… వాటిని ఎవరైనా బెదిరించినా వాటిపై దాడిచేసినా అవికరిచేందుకు ముందుకు వస్తాయి… అందుకే కోతుల గుంపు ఉంది అంటే ఇక అక్కడ ఎవరూ ఉండరు.. అంత దారుణంగా ఉంటాయి అవి. అయితే, కోతిమూకలకు చెక్ పెట్టేందుకు…చాలా చోట్ల కొండముచ్చులను రంగంలోకి దింపుతున్నారు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో కోతులు విశ్వరూపం చూపిస్తున్నాయి..కోతుల భయంతో పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారు తల్లిదండ్రులు..ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాయోనని హడలి పోతున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..