ఆపరేషన్ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు
ఆపరేషన్ థియేటర్లో కత్తులు, కత్తెర్లు పట్టుకొని ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్లు కర్రలు చేతపట్టి పరుగులు పెట్టారు. ఆపరేషన్ చేద్దామని థియేటర్‌లోకి వెళ్లిన డాక్టర్లకు అక్కడ పేషెంట్ కనిపించలేదు కానీ ఓ కోతి మాత్రం అక్కడ దర్జాగా షికారు చేస్తోంది. ఇన్వెస్టిగేషన్‌కి వచ్చిన ఆఫీసర్‌లా ఆపరేషన్ థియేటర్ మొత్తం పరిశీలించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో సెప్టెంబరు 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆపరేషన్ థియేటర్లో కత్తులు, కత్తెర్లు పట్టుకొని ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్లు కర్రలు చేతపట్టి పరుగులు పెట్టారు. ఆపరేషన్ చేద్దామని థియేటర్‌లోకి వెళ్లిన డాక్టర్లకు అక్కడ పేషెంట్ కనిపించలేదు కానీ ఓ కోతి మాత్రం అక్కడ దర్జాగా షికారు చేస్తోంది. ఇన్వెస్టిగేషన్‌కి వచ్చిన ఆఫీసర్‌లా ఆపరేషన్ థియేటర్ మొత్తం పరిశీలించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో సెప్టెంబరు 7న ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది న్యూరో సర్జరీ విభాగంలో ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ గదిలోకి ఎంటరైన వారికి షాకింగ్ సీన్ కనిపించింది. రోగులు ఉండాల్సిన ఆపరేషన్ గదిలో .. కోతి గెంతులేయడం చూసి షాకయ్యారు. ఇన్ని గదులు దాటుకుని ఓ కోతి ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోకి ఎలా వచ్చిందని కంగారు పడ్డారు. దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కత్తులు పట్టుకుని ఆపరేషన్ చేయాల్సిన వైద్యులు, సిబ్బంది.. పొడవాటి కర్ర పట్టుకుని కోతి వెంట పడ్డారు. చాలా సేపు కోతి ఆ గదిలో అటూ ఇటూ వారిని పరుగులు పెట్టించి, తర్వాత బయటకు పారిపోయింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!
నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన