Loading video

ఈ కోతికి ఫోన్‌ కనిపిస్తే చాలు.. వీడియో

|

Mar 22, 2025 | 1:10 PM

కోతి అంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌.. ఎక్కవగా ఆలయాల వద్ద, పర్యాటక ప్రదేశాలలో కోతులు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు తెచ్చుకునే ఆహారాన్ని లాక్కెళ్లిపోతుంటాయి. ఆహారం మాత్రమే కాదు వారి చేతిలో ఏం కనిపించినా వదిలిపెట్టవు. వీటిని తప్పించుకొని వెళ్లడం పర్యాటకులకు పెద్ద సవాలే. ఆదమరిచి చేతిలో ఫోన్‌గాని పట్టుకొని వెళ్లారా.. అదేదో తినే పదార్థం అనుకొని క్షణాల్లో లాక్కెళ్లిపోయి.. మీకు అందనంత ఎత్తులో కూర్చుంటుంది. అక్కడ్నుంచి ఆ యజమానికి ఫోన్‌ కావాలంటే నాకు ఏదైనా ఇవ్వు అన్నట్టుగా సవాలు విసురుతున్నట్టు చూస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది

 ఓ వ్యక్తి చేతిలోని లక్షన్నర రూపాయల విలువైన ఫోన్‌ ఎత్తుకెళ్లిపోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి చూడాలి.. కోతినుండి ఆ ఫోన్‌ తీసుకోడానికి అతను నానా తిప్పలు పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో జరిగింది ఈ ఘటన. ఓ వ్యక్తి రోడ్డుపైన ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ కోతి అతని చేతిలోని ఫోన్‌ లాక్కొని వెళ్లి అక్కడున్న ఎత్తయిన గోడమీద కూర్చుంది. ఊహించని ఈ పరిణామానికి అతను అవాక్కయ్యాడు. అంతేనా రూ.లక్ష 50 వేలు పెట్టి కొనుక్కున్న శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ అది. ఇక అతని పరిస్థితి చూడాలి. ఇచ్చేయమంటూ కోతివైపు దీనంగా చూశాడు. అయినా కోతి కరగలేదు.. ఫోను కావాలంటే నాకు తినడానికి ఏదైనా ఇవ్వు అన్నట్టుగా చూసింది. కోతినుంచి ఫోన్‌ ఎలా దక్కించుకోవాలా అని ఆలోచనలో పడ్డ అతను పక్కనే షాపులో మ్యాంగో డ్రింక్‌ ప్యాకెట్లు కొన్నాడు. ఆ ప్యాకెట్‌ పట్టుకొచ్చి కోతి వైపు విసిరాడు. ఆ ప్యాకెట్‌ కోతికి దూరంగా పడిపోవడంతో అది అందుకోలేకపోయింది. ఈసారి మరో ప్యాకెట్‌ విసిరాడు.. అది సరిగ్గా కోతి చేతిలో పడింది. చేతిలో జ్యూస్‌ ప్యాకెట్‌ పడగానే కోతి క్యాచ్‌ ఇట్‌ అన్నట్టుగా ఫోన్‌ను అతనివైపు విసిరింది. వెంటనే ఫోన్‌ అందుకొని హమ్మయ్య అనుకుంటూ అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం :

కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్‌ వీడియో

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో