Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

|

Dec 02, 2022 | 9:26 PM

బీహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. వీళ్లు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును ఎందుకంటే వారి మాస్టర్‌ ప్లాన్‌ అలా ఉంది మరి. పట్టపగలు యజమాని ఇంటికి వెళ్లి విషయం చెప్పి అతను చూస్తుండగానే ఏకంగా 19 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లిపోయారు.


బీహార్‌ రాజధాని పాట్నాలోని గార్డెన్‌బాగ్‌లో జరిగిందీ ఘటన. స్థానిక కచ్చి తలాబ్ ప్రాంతంలో ఓ మొబైల్ సర్వీస్ కంపెనీ 15 ఏళ్ల క్రితం ఓ సెల్‌ టవర్‌ ఏర్పాటు చేసింది. అయితే కొన్ని నెలలుగా ఆ సెల్‌ టవర్‌ ఏర్పాటుచేసిన స్థలం యజమానికి అద్దె చెల్లించడంలేదు. ఈ విషయం తెలుసుకున్న దొంగల ముఠా ఎలాగైనా ఆ టవర్‌ను లేపేయాలని మాస్టర్‌ ప్లాన్‌ వేసింది . ఓ 15 మంది ఆ టవర్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ స్థలం యజమానిని కలిసి, తాము కంపెనీ నుంచి వచ్చామని, కంపెనీ నష్టాల్లో ఉండడంతో అద్దె చెల్లించలేకపోతున్నామని, టవర్‌ను తీసేయాలనుకుంటున్నామని చెప్పారు. అందుకు ఆయనకూడా అంగీకరించారు. ఆ వెంటనే ఈ దొంగల ముఠా చకచకా టవర్ పైకెక్కి ఒక్కో భాగాన్ని విడదీస్తూ దానిని నేలమట్టం చేశారు. ఇందుకు వారికి రెండుమూడు రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత విడి భాగాలను ట్రక్కులో వేసుకుని తరలించుకుపోయారు. టవర్ నుంచి సిగ్నళ్లు అందకపోవడంతో మరమ్మతుల కోసం వచ్చిన కంపెనీ అధికారులు అక్కడ టవర్ లేకపోవడం చూసి ఖంగుతిన్నారు. యజమానిని కలిసి ఆరా తీశారు. ఆయన చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన టవర్ విలువ 19 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Follow us on