ఓర్నీ !! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడుగా..!

|

Jan 03, 2025 | 8:17 PM

కష్టాలు తీర్చమనో.. తమ కోరికలు నెరవేర్చమనో దేవుడ్ని వేడుకోడానికి ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు. వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు, పూలు అన్నీ తీసుకొని వెళ్తారు. దేవుని దర్శించుకుని తమ కోర్కెలు నెరవేర్చమని వేడుకుంటారు. కానీ ఓ అపర భక్తుడు మాత్రం తన అవసరాలు తీర్చమని దేవుడిని వేడుకుందామని వెళ్లాడు. అయితే దేవుడు వరమిచ్చేసరికి లేటవుద్ది అనుకున్నాడో ఏమో.. స్వామీ ఏమీ అనుకోకండి.. నాకు డబ్బులు చాలా అవసరం..

అందుకు మీ కిరీటం తీసుకెళ్తానని చెప్పి చక్కగా దేవుడి కిరీటం తీసుకొని సంచిలో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో ఓ దొంగ ఆంజనేయస్వామి గుడికి వెళ్లాడు. అందరిలాగే భక్తుడిలా గుడికి వెళ్లిన అతను ఓ పావుగంటపాటు దేవుడికి మొక్కుకున్నాడు. అంతేకాదు స్వామివారిని భజిస్తూ భజన చేశాడు. కీర్తనలు పాడాడు. అందరూ అతడు అపర భక్తుడని ముచ్చటపడ్డారు. కాసేపటికి భక్తులంతా దేవుని దర్శనం ముగించుకొని వెళ్లిపోయారు. అదే అదనుగా ఈ దొంగ భక్తుడు గర్భగుడిలోకి వెళ్లాడు. దేవుడి కిరీటాన్ని తీసుకొని చక్కగా వెళ్లిపోయాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు నెట్టింట చేరి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌.. ముందెన్నడూ చూడని విధంగా

గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం

ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..

రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..