Minister without helmet : హెల్మెట్‌ లేకుండా బైక్‌పై దూసుకెళ్లిన మంత్రి.. పోలీసులు ఏం చేశారంటే..?

చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అన్నది అక్షరాలా రుజువు చేసి చూపించారు అక్కడి పోలీసులు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించారని ఏకంగా రాష్ట్ర మంత్రికే ఫైన్ వేశారు. ప్రస్తుతం ఘటనకు

Minister without helmet : హెల్మెట్‌ లేకుండా బైక్‌పై దూసుకెళ్లిన మంత్రి.. పోలీసులు ఏం చేశారంటే..?

|

Updated on: Jun 29, 2022 | 8:39 PM


చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అన్నది అక్షరాలా రుజువు చేసి చూపించారు అక్కడి పోలీసులు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించారని ఏకంగా రాష్ట్ర మంత్రికే ఫైన్ వేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో స్థానిక ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఒడిశాలోని బాలేశ్వర్​ ట్రాఫిక్​ పోలీసులు చేసిన పనికి ఇప్పుడు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. హెల్మెట్​ లేకుండా బాలేశ్వర్ శాసనసభ్యుడు స్వరూప్ దాస్​ బైక్​ను నడిపారు. ఆయనతో పాటు బైక్​పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ కూడా ఉన్నారు. హెల్మెట్​ లేకుండా బైక్​ నడిపినందుకు ఎమ్మెల్యేకు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఒడిశా విద్యాశాఖ మంత్రికి జరిమానా అనంతరం ఎమ్మెల్యే స్వరూప్​ దాస్ స్థానిక​ ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫైన్‌ కట్టి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఎమ్మెల్యే స్వరూప్ దాస్​తో కలిసి బాలేశ్వర్​లోని పట్టణంలోని వివిధ పాఠశాలల్లో మంత్రి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు హెల్మెట్‌ లేకుండా బైక్‌ ప్రయాణించి ట్రాఫిక్‌ పోలీసులకుచిక్కారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ట్రాఫిక్‌ పోలీసుల చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి ఫైన్ కట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us