Mexico Pyramid: మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

|

Aug 14, 2024 | 4:36 PM

మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్‌ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెను విపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండడం ఈ ఫొటోలలో కనిపిస్తోంది.

మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్‌ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెను విపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండడం ఈ ఫొటోలలో కనిపిస్తోంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్‌లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.

ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదు వార్త. ఇది రాబోయే విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు.. అజ్టెక్‌లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి. ఇక ఇహుట్జోలో ఒక పిరమిడ్ భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని.. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల ​కారణంగా పలు ప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ ఓ ప్రకటనలో తెలిపింది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.