బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేసిందో భార్య. అందుకోసం మరో వ్యక్తి సహకారం కూడా తీసుకున్నారు. మెదక్ మండల పరిధిలోని శివనపూర్ కు చెందిన మైలి శ్రీను అనే వ్యక్తి వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు.
కాగా సడన్ గా ఏప్రిల్ 16 నుంచి కనిపించకుండా పోయాడు. అదే నెల 28న అతని భార్య లత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీను మిస్సింగ్ పై పోలీసులకు అనుమానం రావడంతో భార్య లతను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. గత కొద్ది రోజులుగా లత అదే గ్రామానికి చెందిన వరుసకు బావయ్యే మల్లేశం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్త శ్రీనివాస్ కు తెలియకముతో లతను చాలాసార్లు మందలించాడు. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా జరిగాయి. అయినా లత తీరులో మార్పు రాలేదు. అదే విషయంపై మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చాలని ప్రియుడు మల్లేశంతో కలిసి పథకం వేసింది లత. అదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తికి 50,000 రూపాయలు సుపారీ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..?
పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
