Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 నిమిషాల్లో ట్రైన్ తత్కాల్ టికెట్...బుక్ చేసుకోవడం ఎలా?

2 నిమిషాల్లో ట్రైన్ తత్కాల్ టికెట్…బుక్ చేసుకోవడం ఎలా?

Samatha J
|

Updated on: Oct 05, 2025 | 5:11 PM

Share

అత్యవసర ప్రయాణాలకు తత్కాల్ టికెట్లు కీలకం. ఉదయం 10 గంటలకు విండో తెరుచుకుంటే, రెండు నిమిషాల్లో టికెట్లు అయిపోతాయి. ఈ యుద్ధంలో గెలవడానికి, ఐఆర్‌సీటీసీ మాస్టర్ లిస్ట్, యూపీఐ పేమెంట్, ప్రత్యామ్నాయ ప్రణాళిక వంటి చిట్కాలు పాటించాలి. వేగంగా బుక్ చేసుకునే విధానాలు ఈ వ్యాసంలో తెలుసుకోండి.

అత్యవసర ప్రయాణాలకు రైలు టికెట్లు దొరకనప్పుడు తత్కాల్ బుకింగ్ గొప్ప అవకాశం. అయితే, దీన్ని విజయవంతంగా బుక్ చేయడం ఓ సవాలు. ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభం కాగానే, కేవలం రెండు నిమిషాల్లో సీట్లు నిండిపోతాయి. ఈ రెండు నిమిషాల సమరంలో గెలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా, బుకింగ్ సమయానికి 10 నిమిషాల ముందే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ప్రయాణికుల వివరాలను (పేరు, వయస్సు వంటివి) ఐఆర్‌సీటీసీలోని మాస్టర్ లిస్ట్‌లో ముందుగానే సేవ్ చేయడం ద్వారా టైపింగ్ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం యూపీఐ లేదా ఐఆర్‌సీటీసీ వాలెట్‌ను ఉపయోగించడం ఉత్తమం. నెట్‌బ్యాంకింగ్ ఎంచుకుంటే సమయం పడుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో