భారీ డేటా లీక్‌.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన

|

Jan 25, 2024 | 9:43 PM

చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్‌ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ఎక్స్‌, లింక్డ్‌ఇన్‌ వంటి ప్రముఖ వెబ్‌సైట్ల యూజర్ల వివరాలూ ఇందులో ఉన్నాయి. సురక్షితం కాని ఓ వెబ్‌సైట్లో అతి పెద్ద డేటాబేస్‌ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అందులో దాదాపు 2,600 కోట్ల రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. చరిత్రలోనే ఇప్పటి వరకూ చోటుచేసుకున్న అతి పెద్ద డేటా లీక్‌ ఇదేనని అమెరికాలోని ఫోర్బ్స్‌ పత్రిక కథనం వెల్లడించింది.

చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్‌ వ్యవహారం బయటపడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. ఎక్స్‌, లింక్డ్‌ఇన్‌ వంటి ప్రముఖ వెబ్‌సైట్ల యూజర్ల వివరాలూ ఇందులో ఉన్నాయి. సురక్షితం కాని ఓ వెబ్‌సైట్లో అతి పెద్ద డేటాబేస్‌ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అందులో దాదాపు 2,600 కోట్ల రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. చరిత్రలోనే ఇప్పటి వరకూ చోటుచేసుకున్న అతి పెద్ద డేటా లీక్‌ ఇదేనని అమెరికాలోని ఫోర్బ్స్‌ పత్రిక కథనం వెల్లడించింది. దాదాపు 12 టెరాబైట్ల డేటా లీక్‌ అయినట్లు సెక్యూరిటీ డిస్కవరీ అండ్‌ సైబర్‌ న్యూస్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్‌ చేయడం, సైబర్‌ దాడులు, మోసాలకు పాల్పడే ముప్పు ఉందని హెచ్చరించారు. ట్విటర్‌, లింక్డ్‌ఇన్‌, డ్రాప్‌బాక్స్‌ వంటి పలు ప్రముఖ వెబ్‌సైట్లలోని యూజర్ల వ్యక్తిగత, సున్నిత సమాచారం ఈ డేటాబేస్‌లో ఉన్నాయి. చైనా మెసేజింగ్‌ దిగ్గజం టెన్సెంట్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం వైబోతోపాటు అడోబ్‌, కాన్వా, టెలిగ్రామ్‌ వంటి వెబ్‌సైట్లను ఉపయోగించే యూజర్ల రికార్డులూ లీక్‌ అయినట్లు ఫోర్బ్స్‌ కథనం వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు

Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్

బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??

62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు

రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం