ఆత్మరక్షణలో మవోయిస్టులు వీడియో
మావోయిస్టులు ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డారు. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటుతో కిందిస్థాయి క్యాడర్ కూడా వనాన్ని వీడుతోంది. భద్రతా బలగాల దాడులు, రిక్రూట్‌మెంట్ లేకపోవడం, వ్యూహాత్మక మార్పుల కారణంగా సాయుధ పోరాటాన్ని విరమించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రాణభయమా లేదా వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది.
మావోయిస్టులు ప్రస్తుతం ఆత్మరక్షణలో పడి, వారి సాయుధ పోరాటం చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ముందుగా బతకాలి, ఆ తర్వాతే పోరాటాలు అనే భావన ఇప్పుడు మావోయిస్ట్ క్యాడర్‌తో పాటు అగ్రనేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న కొద్ది రోజుల వ్యవధిలో అనుచరులతో సహా లొంగిపోవడం ఈ పరిణామానికి దర్పణం పడుతోంది.కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండడంతో, కింది స్థాయి క్యాడర్ కూడా సాయుధ పోరాట మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతోంది. భద్రతా బలగాల ముమ్మర దాడులు, ఆపరేషన్ కగర్ వంటి చర్యల వల్ల మావోయిస్టులు కకావికలమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్ మడ్, నార్త్ బస్తర్ వంటి ప్రాంతాలను ఇప్పటికే మావోయిస్ట్ రహిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం :
