దీపావళి సీజన్ లో రికార్డ్ సేల్స్ వీడియోస్
ఈ దీపావళి సీజన్ భారత వ్యాపారులకు రికార్డు స్థాయి అమ్మకాలను తెచ్చిపెట్టింది. రిటైల్, హోల్‌సేల్, సేవా రంగాలు కలిసి గత ఏడాది అంచనాలైన ₹4.75 లక్షల కోట్లను అధిగమించాయి. కేవలం ధంతేరాస్ ఒక్క రోజే ₹1 లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. వినియోగదారుల విశ్వాసం, స్థానిక ఉత్పత్తుల పట్ల మక్కువ ఈ వృద్ధికి దోహదపడ్డాయి.
దీపావళి పండుగ భారతీయ వ్యాపారులకు ఈ ఏడాది సువర్ణావకాశంగా నిలిచింది. దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్, సర్వీస్ రంగాలు కలిసి గత ఏడాది అంచనాలైన ₹4.75 లక్షల కోట్లను మించి రికార్డు స్థాయి వ్యాపారం సాధించాయి. పండుగకు ప్రజలు చూపిన ఉత్సాహం, ఆనందం షాపింగ్ సందడిని పెంచింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఖర్చు చేసింది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనాల ప్రకారం, ధంతేరాస్ పండుగ వేళ ఒక్క రోజులోనే రూ.1 లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఇందులో బంగారం, వెండి అమ్మకాలు రూ.66,000 కోట్లకు పైగా ఉన్నట్లు CAIT పేర్కొంది. ప్రజలు సంప్రదాయబద్ధంగా బంగారం, వెండి, కొత్త పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను కొనుగోలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
